నాందితో నరేష్ తన ట్రాక్ మార్చుకొన్నాడు. అల్లరి పాత్రల్ని పక్కన పెట్టాడు. సీరియస్ కథలపై దృష్టి సారించాడు. మారేడిమల్లి నియోజకవర్గం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ, ఓ మంచి ప్రయత్నంగా మిగిలింది. ఇప్పుడు ఉగ్రంతో మరో కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఓ సీరియస్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇది వరకు కూడా నరేష్ పోలీసు పాత్రలు చేశాడు. అయితే అవన్నీ కామెడీ వేషాలే. ఈసారి మాత్రం సాయికుమార్ రేంజ్ సీరియ్ పాత్ర. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతోంది. ఉగ్రం త్వరలో విడుదల కానుంది. ఆ తరవాత… సోలో బతుకే సో బెటరు ఫేమ్ సుబ్బుతో ఓ సినిమా చేయబోతున్నాడు నరేష్. ఇది కూడా సీరియస్ కథే. ఇందులో నరేష్ రౌడీగా కనిపించబోతున్నాడట. 1980 టైమ్ లో నడిచే కథ ఇది. నేటివిటీ టచ్ ఎక్కువగా ఉంటుందట. రా అండ్ రస్టిక్గా ఈ సినిమా సాగబోతోందని తెలుస్తోంది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఉగ్రం విడుదలైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఉగ్రం హిట్టయితే… ఇక నరేష్ ఈ తరహా కథలకే పరిమితం అయిపోవొచ్చు.