అల్లరి నరేష్ ఎప్పుడో రూటు మార్చేశాడు. నాందితో తన కొత్త ప్రయాణం మొదలైంది. ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం, ఉగ్రం చిత్రాలు అనుకొన్నంత ఫలితాన్ని తీసుకురాలేదు కానీ, తన ప్రయత్నంలో లోపం లేదని అర్థమైపోయింది. నరేష్‌ని డిఫరెంట్ పాత్రల్లో చూడ్డానికి ప్రేక్షకులు, దర్శకులు సిద్దంగా ఉన్నారని తెలిసొచ్చింది. ఇక మీదట కూడా నరేష్ సిన్సియర్‌గానే సీరియస్ పాత్రలవైపు దృష్టి పెట్టడానికి కావల్సినంత బూస్టప్ అందించాయి.
ఇప్పుడు నరేష్ సుబ్బు దర్శకత్వంలో నటిస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు తో ఆకట్టుకొన్న సుబ్బు.. నరేష్ కి ఓ కథ చెప్పాడు. రాజేష్ దండా నిర్మాత. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. తుని ఏరియాలోని ఓ రౌడీ కథ ఇది. బచ్చల మల్లి అనే పేరుతో ఓ రౌడీ తునీలో బాగా ఫేమస్. తన కథే ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమాని పూర్తి `రా` స్టైల్లో డిజైన్ చేశారు. టైటిల్ కూడా `బచ్చల మల్లి` అనే అనుకొంటున్నారు. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్. దాన్నే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది. ఈసారి.. టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.