ఈవీవీ సత్యనారాయణగారికి ఇద్దరు కుమారులు. ఇద్దరిలో పెద్దోడు ఆర్యన్ రాజేశ్‌ని హీరోగా, చిన్నోడు నరేశ్‌ని దర్శకుడిగా చేయాలని కలలు కన్నారు. ఆయన ఒకటి తలిస్తే… దైవం మరొకటి తలచింది! రవిబాబు దర్శకుడిగా పరిచయమైన ‘అల్లరి’తో నరేశ్ హీరోగా మారాడు. ఆర్యన్ రాజేశ్ హీరోగా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు. ‘అల్లరి’ నరేశ్ మాత్రం హీరోగా దూకుడు చూపించాడు. వేగంగా 50 సినిమాలు పూర్తి చేశాడు. అయితే…. అతడిలో తండ్రి వారసత్వం మాత్రం అలాగే ఉంది. అదేనండీ… దర్శకత్వ లక్షణాలు! ఈ హీరోకి దర్శకత్వం చేయాలని కోరిక. అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే… దర్శకుడిగా మారడానికి ఇంకొంచెం సమయం ఉంది. 2020లో మెగాఫోన్ పడతాడట! దర్శకత్వం చేయాలనే ఆలోచనకు ‘విజన్ 2020’ని ఓ పేరు కూడా పెట్టుకున్నానని తెలిపాడు.