నటుడు మురళీ శర్మకి ఊహించని కాంప్లిమెంట్ దొరికింది. అదీ.. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నుంచి. ఈమధ్య పాజిటీవ్ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు మురళీ శర్మ. మంచి నాన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఓ సినిమాలో మురళీ శర్మ నటన అల్లు అరవింద్‌ని విపరీతంగా ఆకట్టుకుందట. ”అతిశయోక్తి అనుకోకపోతే.. ఎస్వీఆర్ అవార్డు ఉంటే.. అది మురళీ శర్వకే ఇవ్వాలి. అంత బాగా నటిస్తున్నాడు” అని కితాబు ఇచ్చాడు అల్లు అరవింద్. అంతేకాదు.. సీనియర్ నటుడు నరేష్‌కీ కాంప్లిమెంట్లు అందాయి. ”నరేష్, మురళీ శర్మ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాని తినేస్తున్నారు. ఈమధ్య ‘సమ్మోహనం’ సినిమా చూశా. నరేష్ చాలా బాగా నటించాడు. ఆ రోజు ఇంటికొచ్చి తనకు మెసేజ్ కూడా పెట్టా” అని గుర్తు చేసుకున్నారు అల్లు అరవింద్. చిన్నప్పుడు తన కళ్ల ముందు తిరిగిన నిహారికను పోస్టర్లపై చూస్తుంటే ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందని, యూవీ క్రియేషన్ సాహసాలకు మారు పేరని, ఈసినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిలషించారు అరవింద్.