అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా కంటే, ఆ సమయంలో విశ్వక్సేన్ టీవీ 9 మధ్య జరిగిన గొడవ గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. దేవీనాగవల్లికీ, విశ్వక్కీ ఓ రేంజ్లో ఫైట్ జరిగింది. నాగవల్లి ఓవరాక్షన్ చేసిందని కొందరంటే, కాదు…విశ్వక్‌నే అనవసరంగా రెచ్చిపోయాడని ఇంకొందరు చెప్పారు. ఏదేమైనా ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. అయితే.. ఈ ఎఫెక్ట్ విశ్వక్సేన్ రాబోయే సినిమాలపై పడే ప్రమాదం ఉంది. ఏ హీరోకైనా పబ్లిసిటీ చాలా అవసరం. టీవీ 9 లాంటి ఛానల్ తో కయ్యం అంత మంచిది కాదు. అందుకే.. ఈ వ్యవహారాన్ని సద్దుబాటు చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగారని టాలీవుడ్ టాక్. టీవీ 9 యాజమాన్యంతో.. ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అల్లు.. ఆహాలో వాళ్లు భాగస్వాములు కూడా. అందుకే విశ్వక్కీ, టీవీ 9కీ ఆయన మధ్య వర్తిగా ఉండి… ఈ గొడవని సెటిల్ చేసేశారని తెలుస్తోంది. డిబేట్లలో ఇవన్నీ మామూలే అని, పట్టించుకోవాల్సిన పనిలేదని, విశ్వక్ సేన్ వ్యవహారశైలే.. అంతని.. టీవీ 9 యాజమాన్యానికి నచ్చజెప్పి.. వాళ్లని బుజ్జగించినట్టు సమాచారం. ప్రస్తుతానికి.. ఈ ఎపిసోడ్‌ని అటు టీవీ 9 ఇటు.. విశ్వక్ ఇద్దరూ మర్చిపోయినట్టే. ఈ వారంలోనే.. టీవీ 9 స్డూడియోలో విశ్వక్‌ని చూసినా ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.