కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్‌లో అకాల వర్షం పడింది. మరీ వర్షాకాలంలో పడినట్లు కాకపోయినా ఓ మాదిరి వర్షం పడింది. ఆ మాత్రం వర్షం చాలు..హైదరాబాద్ రోడ్లు జలమయం అవడానికి. అయ్యాయి కూడా. అలా .. అయిన సందర్భంలో… గౌలిగూడకు చెందిన చంద్రకాంత్, లత దంపతుల నాలుగేళ్ల పాప దివ్య ఇటీవల ఆడుకుంటూ డ్రైనేజి గుంతలో పడిపోయింది. గౌలిగూడ ఫైర్ స్టేషన్ కు చెందిన ఫైర్‌మ్యాన్ క్రాంతికుమార్ వెంటనే అక్కడికి చేరుకుని ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. 12 అడుగుల లోతులో పడిపోయిన బాలికను నిచ్చెన, తాడు సాయంతో 12 అడుగుల లోతున్న గుంతలో దిగి బాలికను చాకచక్యంగా బయటికి తీసుకొచ్చాడు. ఆ వీడియో ఎవరో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. కొన్ని వేల మంది… ఆ పోలీస్ సాహసాన్ని అభినందించారు. శభాష్ అన్నారు.
కానీ అనూహ్యంగా… ఓ రోజు… అల్లు అరవింద్ నేరుగా… ఆ పోలీసు ఉండే ఫైర్ స్టేషన్‌కు వెళ్లారు. పాపని కాపాడి అద్భుతమైన పని చేశారని.. అభినందించి .. రూ.లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. చిరంజీవి గారు మీ సాహసానికి మెచ్చారని చెప్పి అభినందించి వచ్చారు. దానికి మీడియాలో విస్తృతమైన కవరేజీ వచ్చింది. తాజాగా … పోలీసులపై.. మరోసారి అభిమానాన్ని చూపారు… అల్లు అరవింద్. తన గీతా ఆర్ట్స్ సంస్థ తరపున.. హైదరాబాద్ పోలీసులందరికీ.. మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ప్రత్యేకంగా.. ప్యాకేజ్డ్ .. మజ్జిగను.. తన సంస్థకు చెందిన కారులోనే… మనుషుల్ని పెట్టి మరీ పంపిణీ చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా… మీడియాకు పంపారు. అయితే.. ఈ పంపిణీ రోజూ ఉంటుందా.. ఒక్క రోజుకేనా అన్న దానిపై క్లారిటీ లేదు.
సినీ పరిశ్రమలో.. మెగా కుటుంబానికి మేజర్ షేర్ ఉంది. హీరోలు.. నిర్మాతలు.. దాదాపుగా.. యాభై శాతం మెగా క్యాంప్‌లోనే ఉంటారు. ఆ విషయాన్ని వారే చెప్పుకుంటూ ఉంటారు కూడా. అయితే.. ఇప్పటి వరకూ… ఇలా.. ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు పెద్దగా చేపట్టింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం.. హైదరాబాద్ పోలీసులపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు. కారణం ఏదైనా… పోలీసులకు మంచి చేస్తున్నారు కాబట్టి.. అభినందించాల్సిందేనంటున్నారు.. సినీజనం.