శ్రీరెడ్డి వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి రామ్ గోపాల్ వర్మ వైపుకు మళ్లింది. పవన్ కల్యాణ్‌ని శ్రీరెడ్డితో తిట్టించింది నేనే… అంటూ రాంగోపాల్ వర్మ స్వయంగా ప్రకటించడంతో… మెగా అభిమానులు గుర్రుమంటున్నారు. మెగా కుటుంబం నుంచి కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ రాంగోపాల్ వర్మపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ పెట్టి… వర్మపై నిప్పులు చెరిగారు. అరవింద్ ప్రెస్ మీట్లోని హైలెట్స్ ఇవీ..
- శ్రీరెడ్డితో అలా తిట్టించింది నేనే అని వర్మ ప్రకటించడం తన స్వచ్చత నిరూపించుకోవడంలో భాగం. శ్రీరెడ్డి ఎలాగూ తన పేరు బయటపెడుతుందని తెలుసుకున్న వర్మ.. ముందుగానే తప్పు ఒప్పుకుంటూ వీడియో విడుదల చేయడం వెధవ తెలివితేటలకు, చచ్చు తెలివితేటలకు నిదర్శనం. ఆర్జీవిది భూటకం… వెధవ నాటకం.
- సురేష్ కుటుంబంతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని రూ.5 కోట్లతో సెటిల్ చేయిస్తానని శ్రీరెడ్డికి వర్మ మాటిచ్చాడట. అసలు రూ.5 కోట్ల వ్యవహారం సురేష్ కుటుంబం దగ్గర వర్మ ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఈ రూ.5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వర్మ ఆర్థిక స్థితిగతులేంటో నాకు తెలుసు. తనకెవరో ఫండింగ్ చేస్తున్నారు. ఈ కుట్రలో ఇంకెవరెవరు ఉన్నారో తనే చెప్పాలి.
- సురేష్ కుటుంబం ఇబ్బందిపడకూడదని, పరిశ్రమపై ఉన్న గౌరవంతో వర్మ ఇలా చేశాడని చెబుతున్నాడు. మరి అదే చిత్రసీమలో మెగా కుటుంబం లేదా? మెగా కుటుంబంపై నీకు బాధ్యత లేదా? చిరంజీవి, చరణ్, పవన్లంటే నీకు పడదని జనాలకు తెలుసు. నీ దుగ్థ ఇలా తీర్చుకుంటావా?
- పవన్ పెరుగుదలని సహించని నువ్వు… శ్రీరెడ్డిని ఇలా వాడుకుంటావా?
- నీ తల్లినో, అక్కనో, కూతురినో ఇలాంటి తిట్టు తిడితే.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. కానీ నీకున్న నీచత్వం మాకు లేదు.
- వర్మ ఇంత ఎత్తుకు ఎదిగాడంటే దానికి తెలుగు చిత్రసీమే కారణం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వర్మది.
- పరిశ్రమ అంతా సిగ్గు పడే వ్యవహారంలో వర్మ కీలక పాత్రధారి. మరి లాంటి నీచుడ్ని ఏం చేస్తారో పరిశ్రమ పెద్దలే చెప్పాలి.
- ఇలాంటి కుట్రలో పీఆర్పీలో ఉన్నప్పుడు చాలా చూశాను. పవన్ ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. తనని గౌరవించి కటుంబం మొత్తం దూరంగా ఉంది. ఇలాంటి కుట్రలకు బలికాకుండా పవన్ జాగ్రత్త పడాలి.
- వర్మని శిక్షిస్తాడో, క్షమిస్తాడో పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నా.