చిరంజీవితో గీత ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీసిన అల్లు అరవింద్ ఈరోజు సైరా నరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాకు పని చేసిన వాళ్లు కాకుండా ఈ సినిమాను చూసిన మొదటి ప్రేక్షకుడు తానేనని, సినిమా చూసి చెబుతున్నాను, ఈ సినిమా సూపర్ హిట్ అని వ్యాఖ్యానించారు.
నిజానికి ఈ సినిమా చూసేటప్పుడు తాను ఎంతో భయం గా చూశానని, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతోకాలం తీశారు, ఎలా ఉంటుందో అని భయపడుతూ సినిమా చూశానని, కానీ ఒకసారి సినిమా చూశాక, ఎంతో అద్భుతంగా ఫీలయ్యాను అని, సినిమా చూశాక నాకు రామ్ చరణ్ పట్ల ఒక ఫీలింగ్ కల్గిందని వ్యాఖ్యానించారు అల్లు అరవింద్. పైగా, తాను చిరంజీవి తో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, ఇలాంటి గొప్ప సినిమా తీయలేక పోయానే అని బాధ కూడా పడ్డానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. నిర్మాతగా తన 2వ సినిమానే, రామ్ చరణ్ఇ లాంటి గొప్ప సినిమా తీయడం అభినందనీయమని అన్నారు.
క్లుప్తంగా మాట్లాడినప్పటికీ, ఒక బయట వ్యక్తిగా సినిమా చూసి, సినిమా గురించి గొప్పగా మాట్లాడడం తో మెగా అభిమానులకు అల్లు అరవింద్ వ్యాఖ్యలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి.