పుష్ప-2 ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు అల్లు అర్జున్. ముందుగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్నారు. ఆ ప్రమోలు అందరిలో ఆసక్తిని రేపాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి బన్నీ అలాంటి వాఖ్యలు చేశారో అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అలాగే మహేష్, ప్రభాస్ లపై కూడా తన మనసులో మాట పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
-మహేష్ బాబు గారిలో నాకు పర్సనల్ గా నచ్చే విషయం ఆయన కం బ్యాక్స్ చాలా బాగుంటాయి. ఒక ఫెయిల్యూర్ తర్వాత ఆయన కం బ్యాక్స్ చాలా బాగుంటాయి. ఈ విషయంలో ఆయన్ని చాలా అడ్మైర్ చేస్తాను. ఆయన తెలుగు సినిమా స్టాండర్డ్ పెంచిన యాక్టర్. ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్
-కళ్యాణ్ బాబు గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చాలామందిని ఫాలో అవుతుంటాను. కానీ నేను చూసిన వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు.
-ప్రభాస్ గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాది ఒకటే మాట.. ఆయన ఆరడుగుల బంగారం. నేను ప్రతి ఏడాది క్రిస్మస్ ని బాగా డెకరేట్ చేస్తాను. అది తెలిసిన ఆయన ఒకసారి యూరప్ నుంచి చాలా పెద్ద బాక్స్ ని పంపించాడు. అందులో క్రిస్మస్ డెకరేషన్ వస్తువులు ఉన్నాయి. అది నాకు చాలా స్వీట్ మెమొరీ. అలాగే ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టం. నేనొక ఒక మొక్కని గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్ లోనే చాలా పెద్దగా పెరుగుతుంది.