అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ కథా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే బన్నీ ఇండియాకు తిరిగి వస్తారు. వచ్చాక అఫీషియల్ గా ఈ కాంబోకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేస్తారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీది డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఓ పాత్రలో పూర్తిగా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయట. దాదాపుగా విలన్‌కు సమానమైన పాత్ర అదని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమాలో హీరో, విలన్ రెండూ బన్నీనే అన్నమాట. ఈ తరహా పాత్ర చేయడం స్టార్ హీరోలకు ఓ రకంగా ఛాలెంజ్ అనుకోవాలి.
పుష్ప లో కూడా బన్నీ పాత్రలో కొంత నెగిటీవ్ షేడ్ కనిపిస్తుంది. కాబట్టి.. బన్నీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరోవైపు త్రివిక్రమ్ సైతం తన కథపై భారీగా కసరత్తులు చేస్తున్నారు. దుబాయ్ నుంచి బన్నీ తిరిగి వచ్చాక.. త్రివిక్రమ్ తో ఓ మీటింగ్ ఉంటుంది. దాని తరవాత బన్నీ తదుపరి సినిమాపై ఓ స్పష్టమైన ప్రకటన విడుదల అవుతుంది.