అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ లతో `ఐకాన్` అనే సినిమా పట్టాలెక్కించాలని చూశాడు దిల్ రాజు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే… తలుపులైతే.. మూసుకుపోలేదు. ఇంకా ఆ సినిమాపై ఆశలున్నాయి. కాస్త ఆలస్యమైనా `ఐకాన్` సినిమా తీస్తామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. `వకీల్ సాబ్` ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా `ఐకాన్` ప్రస్తావన వచ్చింది. వేణు శ్రీరామ్ తో ఈ సినిమా తీస్తామని, త్వరలోనే అల్లు అర్జున్ ఈ సినిమా గురించిన ఓ ప్రకటన ఇస్తారని చెప్పారాయన.
రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా దిల్ రాజు స్పందించారు. మే, జూన్లలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని, హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నామని, ఆ వివరాలన్నీ త్వరలో చెబుతామన్నారు. దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారాయన. అడ్వాన్సు బుకింగ్ లు మహా జోరుగా ఉన్నాయని, ఎన్ని థియేటర్లు పెంచినా, టికెట్లు అయిపోతున్నాయని, వకీల్ సాబ్ తప్పకుండా ఓ మ్యాజిక్ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారాయన.