జల్లికట్టు వివాదంతో ఆంధ్రప్రదేశ్ ‘స్పెషల్ స్టేటస్’ అంశం మరోసారి తెరపైకి వచ్చంది. తమిళుల జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలానే నినాదం తెరపైకి తెచ్చారు. ఏపీ యువత పేరుతో #APDemandsSpecialStatus అనే హ్యాస్ ట్యాగ్ తో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించడంతో అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఆ పోస్ట్ ప్రకారం.. 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో మౌన నిరసన కార్యక్రమంచేపట్టబోతున్నారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దత్తు తెలిపారు.
జల్లికట్టు స్ఫూర్తి అంటున్నారు కాబట్టి ఇక్కడ తెలుగు చిత్రపరిశ్రమ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకంటే జల్లికట్టు పోరాటంలో తమిళ చిత్ర పరిశ్రమొత్తం ఏకమైకదిలిన సంగతి తెలిసిందే. జల్లికట్టు స్ఫూర్తి తో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం జరిగే ఈ పోరులో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతవరకూ కదిలోస్తుందనే చర్చ మొదలైయింది. కాగా, ఇప్పటికే పలువురు సినీప్రముఖులు దీనిపై మద్దత్తు ప్రకటించారు.
ఇందులో ‘మెగా’ కుటుంబం నుండే ఇద్దరు హీరోలు స్పదించారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ లు మద్దత్తు తెలిపారు. : ‘ప్రజలకు మంచి చేసే ఏ పనికైనా నా మద్దతు ఉంటుంది. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్నా’అన్నాడు వరుణ్. ‘ ఇచ్చిన మాట కోసం పోరాడాల్సిన సమయం’ అని సాయిధరమ్‌తేజ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెంట ఇద్దరు యంగ్ మెగాహీరోలు నడిచినట్లుయ్యింది.
వరుణ్ , సాయితేజులు మద్దత్తు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా చర్చ రామ్ చరణ్, అల్లు అర్జున్ వైపుకు వెళుతుంది. మదత్తు ఇవ్వడంలో చరణ్ కు పెద్ద సమస్య లేకపోవచ్చు. చరణ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ మనిషే. డాడీ చిరంజీవి కాంగ్రెస్ వున్నారు. కాంగ్రెస్ కూడా పోరాటానికి సై అంటోంది. సో.. మద్దత్తు తెలపాలంటే చరణ్ కు పెద్ద ఇబ్బంది ఏమీ వుండదు. ఇక బన్నీ కూడా అంతే. మ్యాగ్జిమం చిరు వాయిసే. అయితే ఎందుకో ఇప్పటి వరకూ వారి నుండి ఎలాంటి కామెంట్లు రాలేదు. బహుసా మెగాస్టార్ నుండి ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాలేదేమో మరి.