షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాని మెచ్చుకుంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. షారుక్ దేశాన్ని మరోసారి ఉర్రూతలూగించారని అభినందించారు. బాక్సాఫీసుని షేక్ చేస్తున్న షారుఖ్ న చూస్తుంటే చాలా గర్వంగా వుందని ట్వీట్ చేశారు బన్నీ. బన్నీ ట్వీట్ కి రీట్వీట్ చేశారు షారుక్. బన్నీ చూపిన ప్రేమ గొప్ప ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ‘పుష్ప’ సినిమా గురించి కూడా మాట్లాడారు షారుక్. పుష్పని మూడు రోజుల్లో మూడు సార్లు చూశా. చాలా విషయాలు నేర్చుకున్నా. వీలైనంత త్వరలో బన్నీని కలుస్తా’ అని ట్వీట్ చేశారు షారుక్.
ఈ ఇద్దరి చాట్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. అయితే ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ఒక భిన్నమైన నైజం మరోసారి బయటపడింది. ఏదైనా సినిమా నచ్చితే వెంటనే స్పందిస్తుంటారు తెలుగు స్టార్స్. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఇలా కాదు. బన్నీ ట్వీట్ చేశాడు కాబట్టి షారుక్ పుష్ప గురించి మాట్లడారు. దీంతో ఇదేదో పరస్పర అభినందనలా అయ్యింది. ఇదే సినిమా చూసినప్పుడే, లేదా బన్నీకి జాతీయ అవార్డు వచ్చినపుడు ఇలా అభినందన వుండివుంటే ఇంకా బావుండేది. ఇలాంటి విషయాల్లో తెలుగు హీరోలు ఉన్నంత ఓపెన్ గా బాలీవుడ్ స్టార్స్ ఉండలేకపోతున్నారనే చెప్పాలి.