తన సినిమా ఆడుతున్నప్పుడు… పక్క థియేటర్లో సినిమాని మెచ్చుకోవడం టాలీవుడ్లోనే కాదు, ఏ ఇండ్రస్ట్రీలోనూ కనిపించదు. ‘మా సినిమా బాగుంది..’ అని చెప్పుకోవడానికే టైమ్ సరిపోదు. ఇక పక్కవాళ్ల సినిమా పట్టించుకునే తీరిక ఎక్కడిది? అయితే.. అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త సంప్రదాయానికి తెర తీశాడు. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా విడుదలైన అయిదు రోజులకు ‘మహానటి’ వచ్చింది. ‘సూర్య’ టాక్ పరంగా, వసూళ్ల పరంగా డల్‌గా ఉన్న సమయంలోనే `మహానటి` విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈదశలో.. ‘మహానటి’ టీమ్‌ని పిలిచి.. ఘనంగా సత్కరించాడు బన్నీ. అంతే కాదు.. ” ఈ సినిమా చూసాక.. అశ్విన్ కి కాల్ చేసి.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. వంటి పిచ్చి పదాలు వాడకుండా.. అశ్విన్ థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ అని చెప్పాను.. సినిమా చూసాక రెస్ట్ లెస్ గా ఫీల్ అయ్యాను.. జెట్ ల్యాగ్ లేకుండా.. జెట్ ల్యాగ్ పిల్ వేసుకుని పడుకున్నా.. అంత ఇన్ఫ్లూయెన్స్ చేసింది నన్ను మహానటి. మంచి స్క్రిప్ట్ ఉంటె ఐస్కాంతంలా మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు వచ్చి అత్తుకుంటారు అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. స్వప్న, ప్రియాంక, అశ్విని దత్ గారు మీరు తప్ప ఇంకెవరు ఈ సినిమా తీయలేరు. లెక్క పెట్టి తీస్తే లెక్కన్తే వస్తుంది.. లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. ఈ సినిమా ఎంత చేసింది అనేది కాదు.. సినిమా ఇస్ నాట్ ఎ నెంబర్ ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్. మహానటి ఇస్ ప్రైస్ లెస్. థ్యాంక్యు అశ్విని దత్ గారికి సినిమా మీద ఉన్న ప్యాషన్ కి హ్యాట్స్ ఆఫ్..“ అంటూ మనస్ఫూర్తిగా అభినందించాడు. బన్నీ ఇచ్చిన కాంప్లిమెంట్లు, చేసిన సత్కారాలు పక్కన పెడితే – తన సినిమా థియేటర్లో ఉండగానే మరో సినిమాని మెచ్చుకుని, ఆ చిత్రబృందాన్ని సత్కరించడం నిజంగానే బన్నీ పాజిటీవ్ స్పిరిట్‌కి నిదర్శనం. హ్యాట్సాఫ్ బన్నీ.