నాగచైతన్య ‘తండేల్’ ఫెబ్రవరి 7న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మధ్యలో మరో రెండు వారాలే వుంది. ఈ పాటికి ప్రమోషన్స్ జోరు పెరగాల్సింది. కానీ ఇప్పటివరకూ ఓ రెండు పాటలే బయటికి వచ్చాయి. బుజ్జితల్లి పాట మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే వెంటనే ప్రమోషన్స్ లో జోరు పెంచమని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇలా కోరుతున్నది చైతు ఫ్యాన్స్ కాదు.. బన్నీ ఫ్యాన్స్.
‘తండేల్’ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, బన్నీవాసు కలసి భారీ బడ్జెట్ తో తీశారు. ఇప్పటివరకూ చైతు కెరీర్ లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. బన్నీ కాంపౌండ్ నుంచి వసున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఆర్మీ ద్రుష్టి పెట్టింది. అల్లు ఫ్యాన్స్ అకౌంట్స్ లో తండేల్ పోస్టులు కనిపిస్తున్నాయి. ‘ప్రమోషన్స్ స్టార్ట్ చేయండి. బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధం’ అంటూ ఫ్యాన్స్ తమదైన శైలిలో ప్రకటిస్తున్నారు. ‘పుష్ప రాజ్ కా బాప్.. తగ్గేదేలే’ అంటూ తండేల్ ఫోటోలతో అల్లు అర్జున్ ని ట్యాగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే తండేల్ సినిమాకి బన్నీ ఫ్యాన్స్ డ్యూటీ చేసేలానే కనిపిస్తున్నారు. చైతు సరైన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తండేల్ పైనే తన ఆశలన్నీ వున్నాయి. ఇలాంటి సమయంలో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తండేల్ కి సపోర్ట్ చేస్తే అంతకంటే ఏం కావాలి.