అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశించాలని పోలీసుల తరపు లాయర్ నాంపల్లి కోర్టును కోరారు. ఇలాంటి వాదనలు వినిపిస్తే .. బెయిల్ ను వ్యతిరేకించనట్లే లెక్క అనుకోవచ్చు. అయితే రొటీన్ గా చేసే వాదనలు మాత్రం చేశారు. బెయిల్ ఇస్తే సాక్షుల్నిప్రభావితం చేస్తారని .. ఆయన వవర్ ఫుల్ వ్యక్తి అని కూడా వాదించారు. అయితే అంతిమంగా బెయిల్ ఇస్తే విచారణకు సహకరించాలని ఆదేశించాలని వాదించడంతో అక్కడే వ్యవహారం తేలిపోయినట్లయిందని లాయర్లు అంటున్నారు. అల్లు అర్జున్ ను మరోసారి జైలుకు పంపాల్సిన అవసరం లేదని పోలీసులు కూడా అనుకుంటున్నారని అనుకోవచ్చు.
అల్లు అర్జున తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదని. BNS సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చిందని . అందుకే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇరువర్గాల వాదనలు పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. మూడో తేదీన తీర్పును వెల్లడించనున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు పదో తేదీ వరకూ ఉంది. మూడో తేదీన బెయిల్ రావడం దాదాపు ఖాయమని అల్లు అర్జున్ టీం నమ్మకంతో ఉంది.