అల వైకుంఠపురం లో సినిమా మ్యూజికల్ నైట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో హీరో అల్లు అర్జున్, తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే కంటతడి పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
“అల్లు అరవింద్ most misunderstood పర్సన్” అంటూ మొదలు పెట్టిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు దాదాపు 45 ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నారని, అన్నేళ్ల పాటు సినిమా రంగంలో కానీ లేదా ఏదైనా బిజినెస్ లో కానీ కొనసాగాలంటే వాళ్ళ మనసులో ఎంతో ప్యూరిటీ ఉంటే తప్ప అది సాధ్యం కాదని అన్నారు. కానీ అల్లు అరవింద్ ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారని, ఆయన తో డీల్ చేయడం చాలా కష్టం అని అంటూ ఉంటారని, కానీ మీరు స్ట్రైట్ గా ఉంటే ఆయనంత స్వీట్ పర్సన్ మరొకరు ఉండరని, కానీ మీరు క్రూక్డ్ గా ఉంటే , ఆయన కూడా అలాగే ఉంటారని అల్లు అర్జున్ అన్నారు. తాను ఎంతో మంది ఫాదర్స్ ని చూశాను కానీ, అల్లు అరవింద్ గొప్ప ఫాదర్ అని అల్లు అర్జున్ అన్నారు. తాను ఎప్పుడు ఆయనకు థాంక్యూ చెప్పలేదని, ఈరోజు మొదటి సారిగా సభాముఖంగా ఆయనకు థాంక్యూ చెబుతున్నానని అంటూ కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకున్నారు. తనకు పెళ్లి కాకముందే ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, తన భార్యతో పెళ్ళికి ముందు తాను పెట్టిన ఒకే ఒక కండిషన్, పిల్లల తర్వాత కూడా తన తండ్రితో పాటు కలిసి ఉంటా అని చెప్పడమే అని అల్లు అర్జున్ అన్నారు. స్టేజిపై అల్లు అర్జున్ కంటతడి పెట్టుకోవడం ప్రేక్షకులకు ఆర్ద్రత గా అనిపించింది. అల్లు అరవింద్ కూడా స్టేజిపైకి వెళ్లి అల్లు అర్జున్ ని హత్తుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎంతగానో సేవ చేసిన అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా సంక్రాంతికి విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు, దర్బార్, కళ్యాణ్ రామ్ సినిమా లు కూడా తన సినిమాతో పాటు హిట్ అవ్వాలని కోరుకుంటూ పెద్దమనసు చాటుకున్నాడు అల్లు అర్జున్.