ఎక్కడ చూసినా అర్జున్ రెడ్డి హంగామానే. సైలెంట్ గా వచ్చి టాలీవుడ్‌ని షేక్ చేసేసింది ఈ సినిమా. స్టార్ హీరోలతో సహా.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డికి అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించాడట. ‘మనం కలసి పనిచేద్దాం’ అని మాట కూడా ఇచ్చినట్టు టాక్. అల్లు అర్జున్‌ని దృష్టిలో ఉంచుకొనే… ఈ కథని తయారు చేశానని ఓ సందర్భంలో సందీప్ చెప్పాడు. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఈ కథనీ, సందీప్ లాంటి కొత్త దర్శకుడ్నీ నమ్మే అవకాశాల్లేవు. అల్లు అర్జున్ అనే కాదు.. ఏ పెద్ద హీరోని కలిసినా… ఈ కథని ఒప్పుకొనే పరిస్థితి కనిపించేది కాదు. అందుకే.. యువ హీరోలపై దృష్టి పెట్టాడు సందీప్. ఈ సినిమా విడుదలయ్యాక… సందీప్‌పై నమ్మకాలు పెరిగిపోయాయి. ఓ పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడన్న నమ్మకం కుదిరింది. అందుకే బడా హీరోలు సందీప్‌పై దృష్టి పెట్టారు. శర్వానంద్‌తో సందీప్ రెండో సినిమా దాదాపుగా ఖాయమైంది. సో.. అక్కడా హిట్ కొట్టి అర్జున్ రెడ్డి విజయం గాలివాటం కాదని నిరూపించుకొంటే.. బన్నీ సినిమాకి తలుపులు తెరచుకొన్నట్టే.