పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్.. అన్న కామెంట్, ఆ తరవాత జరిగిన రచ్చ, ఫ్యాన్స్ చేసిన గోలలకు పుల్ స్టాప్ పెట్టేయత్నం చేశాడు అల్లు అర్జున్. దీనికి ఒక మనసు ఆడియో వేడుక వేదిక అయ్యింది. ఈ ఫంక్షన్‌కి బన్నీ వస్తాడు.. వచ్చి పవన్ గురించి మాట్లాడతాడు అని సినీ జనాలు ముందే అనుకొన్నారు. దానికి తగ్గట్టే బన్నీ స్పీచ్ సాగింది. `ఇదంతా చేసింది అభిమానుల ఓవరాక్షన్ వల్లే` అంటూ ఆ నెపం కూడా ఫ్యాన్స్ మీద తెలివిగా నెట్టేశాడు బన్నీ. మెగా ఫంక్షన్లలో, బయట ఫంక్షన్లలో పవర్ స్టార్, పవర్ స్టార్ అని కొంతమంది అభిమానులు అరచి గోల పెట్టడం వల్ల వేదికపై ఉన్న వాళ్లు ఏమీ మాట్లాడడం లేదని, `మావాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి` అని ఓ హీరో బన్నీతో తన బాధ వ్యక్తం చేసుకొన్నాడని, అప్పుడు మరింత ఫీలయ్యాడని, అందుకే పవన్ ఫ్యాన్స్ ఎంత అరచి గోల పెట్టినా పవన్ గురించి మాట్లాడకూడదనుకొన్నాడట. అయితే పవన్ మ్యాటర్ ఎవాయిడ్ చేయడం వల్ల ఇంత కాంట్రవర్సీ అవుతుందని ఊహించలేదట. వవన్ అంటే తనకు చాలా ప్రేమ ఉందని, దాన్ని చాలాసార్లు బయటపెట్టాడనని, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముందని అంటున్నాడు. పవన్ స్వయంగా ‘నేను ఎదగడానికి కారణం చిరంజీవి అన్నయ్యే’ అని వందల సార్లు చెప్పారని, అలాంటి చిరంజీవి గారిని కూడా వేదిక పై మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని ఆ విషయంలో తాను చాలా హర్టయ్యానని చెబుతున్నాడు బన్నీ. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు యుద్ధం ఆపమని పవన్ ఫ్యాన్స్‌ని కోరుకొన్నాడు. ‘మీలో మీకు అన్ని గ్రూపులుండొచ్చు.. కానీ మేం అంత ఒకటే ఫ్యామిలీ కదా’ అంటూ లాజిక్ లాగాడు.
పబ్లిక్ ఫంక్షన్లలో అరచి గోల పెట్టడం మంచిదే అని, అయితే దానికీ ఓ లిమిట్ ఉండాలని.. ఇదంతా ఫ్యాన్స్ ముందే చెప్పాలనుకొని ఇన్నాళ్లూ ఆగానని, ఫ్యాన్స్‌కి అర్థమవ్వాలనే పవన్‌ని ఎవాయిడ్ చేసి, కాంట్రవర్సీని తన నెత్తిమీద పూసుకొన్నానని అంటున్నాడు బన్నీ. మొత్తానికి బన్నీ స్పీచ్ అంతా పవన్ చుట్టూనే సాగింది. అభిమానుల్ని సాధ్యమైనంత కూల్ చేద్దామని ప్రయత్నించాడు బన్నీ. ఇక మీదట పబ్లిక్ ఫంక్షన్లలో ఫ్యాన్స్ ఎలాంటి ఇబ్బంది కలగ చేయరన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశాడు. మరి… బన్నీ స్పీచ్‌తో.. ఇచ్చిన క్లారిటీతో పవన్ ఫ్యాన్స్ సంతృప్తి పడతారో లేదో తెలియాలంటే, ఇంకో మెగా ఫంక్షనేదో జరగాల్సిందే.