రూ.1000 కోట్ల మార్క్‌కి అతి చేరువలో ఉంది పుష్ప. ఈ ఘనత అతి తక్కువ సినిమాలకే దక్కింది. కాబట్టి… ఈ మూమెంట్ ని అల్లు అర్జున్ సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్సయ్యాడు. రేపటికి పుష్ప రూ.1000 కోట్ల మార్క్ చేరుకుంటుంది. ఆ తరవాత ఈ బండి ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. కనీసం రూ.1500 కోట్లయితే ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్క వేస్తున్నాయి. నార్త్ లో వసూళ్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి.. అనుకొన్న టార్గెట్ పుష్ప రీచ్ అయిపోయినట్టే.
అందుకే బన్నీ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయాడు. పుష్ప 2ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. అందుకు తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సిద్ధమైందని టాక్. వచ్చేవారం బన్నీ నార్త్ టూర్ వేయబోతున్నాడు. ముంబైలో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. అక్కడి మీడియాని బన్నీ కలుస్తాడని, తనకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకొంటాడని సమాచారం. బెంగళూరు, చెన్నై, కేరళలోకూడా ఇలాంటి మీట్ లు జరగబోతున్నాయి. చివరాఖరగా హైదరాబాద్ లో ఓ గ్రాండ్ పార్టీ ఇస్తాడని సమాచారం. దాంతో పుష్ప 2 ప్రమోషన్లకు కూడా పుల్ స్టాప్ పడబోతోంది.
మార్చి నుంచి త్రివిక్రమ్ తో సినిమా మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ఉన్న మూడ్, వర్క్ ప్రెషర్ని చూస్తే ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. అంటే ఈమధ్య బన్నీకి బోలెడంత సమయం ఉందన్నమాట. ఈ టైమ్ అంతా తన కుటుంబానికి కేటాయించాలనుకొంటున్నాడు. హైదరాబాద్ మీట్ తరవాత.. బన్నీ ఫారెన్ వెళ్తాడని, అక్కడ విశ్రాంతి తీసుకొంటాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.