తెలుగు సినిమా హీరోలు చాలా ఎక్కువ మందే బ్రాహ్మణ యువకుడి పాత్రలో మెరిశారు. సీనియర్ హీరోల నుంచి ఈ తరం హీరోల వరకూ అందరూ ఓ సారి బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్లో కనిపించినవాళ్ళే. తెలుగు సినిమా ట్రేడ్ మార్క్ బ్రాహ్మణ యువకుడి పాత్ర అనేసరికి వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరీలో వేరియేషన్ చూపించడానిక అందరు హీరోలు కూడా చాలా చాలా ట్రై చేశారు. కానీ అదుర్స్ సినిమాలో చారి క్యారెక్టర్‌తో అందరు హీరోలనూ బీట్ చేసి పడేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అయితే అద్భుతః అనే స్థాయిలో ఉంటుంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కూడా అదుర్స్ అనే రేంజ్లో ఉంటుంది. అదుర్స్ చారి క్యారెక్టర్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసిన తర్వాత….మరే ఇతర హీరో అయినా సరే బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్లో కనిపించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందేే. మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ అయితే కచ్చితంగా పోలికలు వస్తాయి. కానీ ఆ ఛాలెంజ్‌కి బన్నీ రెడీ అయ్యాడు. అదుర్స్ సినిమాకు రైటింగ్ విభాగంలో వర్క్ చేసిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే….ఆ చారి టైప్ ఆఫ్ పాత్రలోనే కనిపించడానికి రెడీ అయ్యాడు. దువ్వాడ జగన్నాథం సినిమా అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచే చారి క్యారెక్టర్‌తో పోలికలు మొదలయ్యాయి. ఈ రోజు డిజె టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మొత్తం కూడా దువ్వాడ జగన్నాథం క్యారెక్టరే కనిపించింది. అలాగే దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్లో బన్నీ డైలాగ్ డెలవరీ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. మరి దువ్వాడ క్యారెక్టర్లో బన్నీ యాక్టింగ్ ఎలా ఉంది? చారిగా కనిపించిన ఎన్టీఆర్ యాక్టింగ్‌ని బీట్ చేయగలిగాడా?
ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ ముందు బన్నీ తేలిపోయాడు. బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎన్టీఆర్‌తో పోల్చుకుంటే బన్నీ ఫెయిల్ అయ్యాడు. ఇక డైలాగ్ డెలివరీ విషయంలో అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు. డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్‌తో పోటీపడుతున్న మెగా హీరో బన్నీనే. అలాగే రీసెంట్ టైమ్స్‌లో గోన గన్నారెడ్డిలాంటి క్యారెక్టర్స్‌లో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో కూడా చూపించాడు బన్నీ. అన్నింటికీ మించి చారి క్యారెక్టర్ని డెవలప్ చేసిన హరీష్ శంకరే డిజెకు కూడా డైరెక్టర్ కావడంతో అభిమానులు చారి స్థాయిలోనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బన్నీ మాత్రం సినిమా లవర్స్‌తో పాటు అభిమానులను కూడా డిసప్పాయింట్ చేశాడు. ‘ఏ క్యారెక్టర్లో కనిపించినా….అల్లు అర్జున్ కంటే ది బెస్ట్‌గా ఇంకెవరు చెయ్యలేరు……అల్లు అర్జున్ తప్ప ఇంకెవరూ ఆ క్యారెక్టర్ని అంత అద్భుతం చేయలేరు….’ అని చెప్పుకోవాలన్నది అల్లు అర్జున్ యాంబిషన్. ఈ విషయాన్ని డైరెక్టర్స్‌తో కూడా షేర్ చేసుకుంటాడు. ఆర్య, జులాయి, వేదం, రుద్రమదేవిలాంటి సినిమాలలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి క్రిటిక్స్ కూడా ఆ స్థాయి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ విషయంలో మాత్రం బన్నీ పూర్తిగా ట్రాక్ తప్పాడు. మరీ ముఖ్యంగా చారి క్యారెక్టర్లో ఎన్టీఆర్ జీవించిన విధానంతో పోలిస్తే అల్లు అర్జున్ యాక్టింగ్ మరీ తీసికట్టుగా ఉంది. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం అయిపోయి ఉంటుంది కాబట్టి బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇప్పుడిక చేయగలగింది ఏమీ లేదు కానీ కనీసం డైలాగ్ డెలివరీ విషయంలో అయినా బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా అంతా కూడా డైలాగ్ డెలివరీ ఇలానే ఉంటే మాత్రం కామెడీ కాస్తా ఎటకారం అయిపోవడం…….ఎన్టీఆర్‌తో పోల్చి బన్నీ యాక్టింగ్‌ని విమర్శించడం లాంటివి మామూలుగా ఉండవేమో…?