అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమా కథ.. చూచాయిగా బయటకు వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బన్నీ ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడు. అతను పెళ్లిళ్లలో వంట చేస్తుంటాడట. అయితే కోపం ఎక్కువ. సమాజంలో అన్యాయాల్ని సహించలేడు. అగ్రహారం వదిలి… అప్పుడప్పుడూ… టౌన్‌కి వెళ్తుంటాడు. పట్నంలో మాత్రం మనోడి వేషభాషలన్నీ మారిపోతుంటాయి. ఇక్కడ.. ఓ గ్యాంగ్‌ని పట్టుకొని ఉతికి ఆరేసే కార్యక్రమం పెట్టుకొంటాడు. ఆ గ్యాంగ్ ఏమిటి? ఆ గ్యాంగ్‌పై బన్నీకి ఉన్న పగేంటి? అనేదే కథ.
ఓ పోలీస్ ఆఫీసర్.. జగన్నాథమ్ యాటిట్యూడ్ చూసి ముచ్చటపడతాడు. నేరస్థుల ఫైల్స్ అన్నీ జగన్నాథమ్ చేతిలో పెట్టి.. వాళ్ల అంతుచూడమని ప్రోత్సహిస్తుంటాడు. అంటే ఈ సినిమాలో బన్నీ పోలీస్ కాని.. పోలీస్ అన్నమాట. దువ్వాడ జగన్నాథమ్ అవుట్‌లైన్ ఇది. దాన్ని హరీష్ శంకర్ తనదైన మాస్, ఎంటర్టైనింగ్ బాటలో స్క్రిప్టు సిద్దం చేశాడు. బన్నీకి ఈ కథ ఫస్ట్ సిట్టింగ్ లోనే బాగా నచ్చిందట. అందుకే… సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత… దువ్వాడ జగన్నాథమ్ అనే టైటిల్‌కి ఓకే చెప్పగలిగాడు. టైటిల్.. సంసార పక్షంగా ఉన్నా.. సినిమా మాత్రం మాస్ ఎంటర్ టైనర్‌గా ఉండబోతోంది. 2017 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.