‘డీజే’ ట్రైలర్ వచ్చేసింది. అక్కడక్కడ ఛమక్కులతో, మాసీ డైలాగులతో ట్రైయిలర్ ఓకే అనిపించేలా ఉంది. అల్లు అర్జున్ హీరోయిజం, స్టైల్ కావల్సినంత రంగరిస్తూ… పూజా హెగ్డే గ్లామర్‌ని కొత్తమీరలా జోడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కిన డీజే ఈనెల 23న రాబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఇంగువ లేకుండా పూలిహోర చేసేస్తూ సభ్యసమాజానికి మనమేం మెసేజ్ ఇద్దామని’ అనే డీజే ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీతో ట్రైలర్ మొదలెట్టారు. ‘నాది మామూలు లవ్వా.. లవ్వఙ లవ్వస్య లవ్వోవ్యహ’ అంటూ వెరైటీ డైలాగ్ పలికించాడు. ‘పగిలిపోయేలా వాయించే డీజే’ అనే డైలాగ్‌లో కావల్సినంత హీరోయిజం చూపించాడు. అయితే “యుద్ధం శరణం గచ్చామి” అనే రొటీన్ డైలాగులూ వినిపించాయి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో చూసిన రావు రమేష్ విలనిజం ఇందులోనూ దింపేసినట్టు అనిపిస్తోంది. ట్రైలర్లో వినిపించే డైలాగులన్నీ మూటగడితే… కథాగమనం ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.
టోటల్‌గా చూస్తే.. డీజే ట్రైలర్లో ‘కొత్తగా ఉంది.. భలే వుంది’ అనే ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కొలతలు, తూనికల్ని డీజే కూడా ఫాలో అయిపోయాడా అనిపించకమానదు. కాకపోతే.. బన్నీ ఫ్యాన్స్‌కి మాత్రం డీజే ట్రైలర్ నచ్చేయొచ్చు. అటు దువ్వాడ జగన్నాథమ్ గా, ఇటు డీజేగా బన్నీ లుక్స్, వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ అభిమానుల్ని ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఎప్పట్లా రీ రికార్డింగ్ లో దేవిశ్రీ తన మార్క్ చూపించాడు. పూజా గ్లామర్ మరోసారి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది. బన్నీ స్థాయి స్టెప్పులెక్కడా కనిపించకపోవడం డీజే ట్రైలర్లో కనిపించే అతి పెద్ద లోటు.