మాదాపుర్ ఏన్.కన్వెన్షన్, గీతా ఆర్ట్స్ ఆఫీసుల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాల్ చల్ చేశారు. బన్నీతో అభిమానుల ఫోటో షూట్ ఉందని సమాచారం రావడంతో భారీగా అక్కడికి చేరుకున్నారు అభిమానులు. అయితే అల్లు అర్జున్ ఫోటో షూట్ కి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు, ఏన్.కన్వెన్షన్ అద్దాలు గేటు ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్ జరిగింది.
మరోవైపు,.. ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మైత్రీ మూవీ మేకర్స్‌పై కేసు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతికి మించి యూసుఫ్‌గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో అభిమానులను సమీకరించడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సుమోటోగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.