అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల విలువైన రెండు పూచికత్తులు సమర్పించాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశించాలని పోలీసుల తరపు లాయర్ గత విచారణలో కోరడంతో పోలీసులకు ఆయనను మళ్లీ జైలుకు పంపాలన్న ఆలోచన లేదని క్లారిటీ వచ్చింది. అయితే తీర్పు అధికారికంగా వచ్చే వరకూ అల్లు అర్జున్ టీమ్‌కు టెన్షన్ తప్పలేదు.
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన అర్జున్ మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చినప్పపటికీ ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వతా జరిగిన పరిణామాలు మరింత వరస్ట్ గా మారాయి. పోలీసులపై ఆరోపణలు చేస్తూ.. వారితే తప్పన్నట్లుగా చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. చివరికి పెద్దలు జోక్యం చేసుకోవడంతో చల్లబడ్డాయి. సినీ పరిశ్రమ పెద్దలంతా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. తర్వాత పోలీసులు కూడా అర్జున్ ను మరోసారి జైలుకు పంపాలని అనుకోలేదు.
కానీ ఓ సారి విచారణకు పిలిపించి మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. మరో వైపు బాధిత కుటుంబానికి కూడా ఇండస్ట్రీ మొత్తం అండగా నిలిచింది. ఒక్క పుష్ప టీమే రూ. రెండు కోట్లను అందించింది. ఇతరులు కూడా బాగా సాయం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ. పాతిక లక్షలు ఇచ్చారు. అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో.. ఈ కేసులో ఇక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదని అనుకోవచ్చు.