టాలీవుడ్లో ముగ్గురు అత్యుత్తమ డాన్సర్ల లిస్టు తీస్తే.. అందులో అల్లు అర్జున్ పేరు తప్పకుండా ఉంటుంది. బన్నీ డాన్స్ గురించి.. తనతో కలసి నటించిన హీరోయిన్లంతా గొప్పగా చెబుతుంటారు. బన్నీకి అభిమాన గణం ఇంతగా పెరగడానికి కారణం.. అతని నృత్యాలు కూడా. సాయిపల్లవి కూడా గొప్ప డాన్సర్. తమన్నా తరవాత డాన్సింగ్ లో అంత పేరు తెచ్చుకున్న కథానాయిక తనే. `వచ్చిండే… మెల్ల మెల్లగా వచ్చిండే` పాటలో సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా అయిపోయారంతా. సాయి పల్లవి డాన్స్.. బన్నీకీ తెగ నచ్చేసిందట. ‘సాయి పల్లవి ఈ పాటని ఎన్నిసార్లు చూసిందే తెలీదు గానీ.. నేను మాత్రం తనకంటే ఎక్కువసార్లు చూసుంటా’ అని ఈ పాటపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు బన్నీ. అంతే కాదు… ‘సాయి పల్లవి పక్కన నటించాలని కంటే… తనతో ఎప్పుడెప్పుడు డాన్స్ చేస్తానా’ అని ఎదురుచూస్తున్నా.. అని తన మనసులో మాట బయటపెట్టాడు. బన్నీనే అలా అంటే.. సాయి పల్లవికి తన సినిమాలో ఛాన్స్ రాకుండా ఉంటుందా? బన్నీ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ముందుగా త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతోంది. ఆ తరవాత కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సివుంది. మధ్యలో మారుతి కూడా స్క్రిప్టు పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఈ బంచ్లో బన్నీతో నటించే ఛాన్స్ సాయి పల్లవికి రాకుండా ఉంటుందా???