సినిమా వాళ్లంతా పార్ట్ టైమ్ వ్యాపారాలు చేసుకొంటూ రెండు చేతులా సంపాదించుకొంటున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ మొన్నామధ్యే ఓ జిమ్ పెట్టింది. రామ్ చరణ్ విమానయాన సంస్థకు ఓనర్ అయిపోయాడు. శర్వానంద్‌కి కాఫీ షాప్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ వ్యాపారం మొదలెడుతున్నాడు. ‘800 జూబిలీ’ అనే పేరుతో నైట్ క్లబ్ పెడుతున్నాడు బన్నీ. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో నెలకొల్పిన ఈ బార్ అండ్ రెస్టారెంట్‌ని ఈనెల 29న అల్లు అర్జున్ ప్రారంభిస్తున్నాడు. ఈ విషయాన్ని బన్నీ ధృవీకరించాడు కూడా. ఈ నైట్ క్లబ్ స్సెషాలిటీ ఏంటో తెలుసా?? బీర్లు సొంతంగా తయారు చేస్తారట. అంటే మందు బాబులకు కొత్త రుచులు వడ్డించబోతున్నారన్నమాట. ఇది బన్నీ సొంత వ్యాపారం కాదు.. జస్ట్ పార్టనర్‌గా చేరాడు. బన్నీ బ్రాండ్ తోడుంటే బాగుంటుంది అనుకొన్న 800 జూబిలీ సంస్థ బన్నీతో ఓ ఒప్పందం కుదుర్చుకొంది. బన్నీ తన వాటా గా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు టాక్. ఈ బ్రాంచుల్ని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. బన్నీకి ఈ కొత్త వ్యాపారం ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.