మల్టీస్టారర్ చిత్రాలకు మీరు రెడీయేనా.. అని ఏ కథానాయకుడ్ని అడిగినా `ఎందుకు చేయమండీ.. బ్రహ్మాండంగా చేస్తాం..` అంటారు. అయితే ఈ విషయలో అల్లు అర్జున్ స్ట్రాటజీ వేరుగా ఉంది. బన్నీ అయితే… మల్టీస్టారర్ సినిమాలకు నేను దూరం అంటున్నాడు. ”ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదు. కొన్నాళ్ల పాటు సోలో హీరోగా సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యా. అలాంటి కథలే వింటున్నా” అంటున్నాడు. అయితే స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే మాత్రం వదలను అంటున్నాడు.
”గోనగన్నారెడ్డి పాత్రల్లాంటివి వస్తే… తప్పకుండా చేస్తా. సినిమా మొత్తం కనిపించకపోయినా.. ఓ ఇరవై నిమిషాలు అలా మెరిసి, వెళ్లిపోతే చాలు. నా పాత్రతో కథకు కిక్ వస్తుందనుకొంటే.. చేయడానికి సిద్ధమే. కానీ అలాంటి పాత్రలు తయారు చేసేవాళ్లెవరున్నారు” అంటున్నాడు. తాజాగా బన్నీ సరైనోడు వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. 24, సుప్రీమ్ సినిమాలొచ్చినా, బీసీల్లో నిలకడగా వసూళ్లు దక్కించుకొంటోంది. వచ్చే వారం బ్రహ్మోత్సవం వరకూ సరైనోడుకి వసూళ్లు వస్తూనే ఉంటాయి. సరైనోడు టైమ్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో బన్నీకి బాగా కలిసొచ్చింది.