రివ్యూల సంగతి ఎలా ఉన్నా… బాక్సాఫీసు దగ్గర మాత్రం సరైనోడు జోరు చూపించాడు. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్‌కి దగ్గరగా ఉంది. బీసీల్లో మంచి వసూళ్లు దక్కించుకొంది. దాంతో బన్నీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సరైనోడు అయిపోయింది. మరి తరవాతేంటి? మరుసటి సినిమా ఎప్పట్లోగా పట్టాలెక్కిస్తాడు? దర్శకుడు ఎవరు? ఈ విషయాల్ని తేల్చుకోలేకపోతున్నాడు బన్నీ. విక్రమ్ కె.కుమార్ ప్రాజెక్ట్ ఓకే అయినా, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదట. మరోవైపు లింగు స్వామి కూడా స్టోరీతో రెడీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో దేన్ని ముందు సెట్స్‌పైకి తీసుకెళ్లాలో బన్నీకి కూడా క్లారిటీ లేదు.
”విక్రమ్ కె.కుమార్ తో ఓ సినిమా అనుకొన్నాం. అయితే.. ఇంకా ఏదీ ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడే సినిమా సంగతులు చెప్పలేను. మరో నెల రోజులు సమయమైనా కావాలి…” అంటున్నాడు బన్నీ. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… విక్రమ్ కె.కుమార్ దగ్గర స్ర్కిప్టు రెడీగా లేదట. కథ చెప్పినా..స్ర్కిప్టు విషయంలో టైమ్ అడిగాడట. అందుకే బన్నీ ఈ డైలామాలో పడ్డాడు. బన్నీ తదుపరి సినిమా ఏంటో తెలియాలంటే.. నెల రోజులైనా ఆగాల్సిందే.