నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా తరవాత అల్లు అర్జున్ సినిమా ఎవరితో? అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తించింది. `భరత్ అనే నేను`తో సూపర్ హిట్టుకొట్టిన కొరటాల శివకే ఆ అవకాశాలు ఉండొచ్చని చెప్పుకున్నారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న దర్శకుడు కొరటాలే కాబట్టి ఈ క్యాలుక్లేషన్స్ వర్కవుట్ అవ్వొచ్చనుకున్నారు. బన్నీ – కొరటాల మధ్య సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా విక్రమ్ కె.కుమార్ లైన్లోకి వచ్చాడు. ఇది వరకే అల్లు అర్జున్ – విక్రమ్ కాంబో సెట్టవ్వాల్సింది. కానీ కుదర్లేదు. ఎట్టకేలకు ఈ కాంబో పట్టాలెక్కబోతోంది. నల్లమలపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. నా పేరు సూర్య తరవాత పట్టాలెక్కే బన్నీ సినిమా ఇదే. నాని – విక్రమ్ కె.కుమార్ కాంబోలో ఓ సినిమా మొదలవ్వాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు అనుకోకుండా ఆగిపోయింది. దాంతో బన్నీ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది.