చాలా సైలంట్ గా మరో సినిమాను ఓకే చేసాడు. ఒక పక్క త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా ఇంకా స్టార్ట్ కావాల్సి వుంది. మరోపక్క సుకుమార్ కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు ఓకె చెప్పేసాడు. అంతే కాదు. ఆ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుండడం, దాన్ని మొత్తం విని బన్నీ ఓకె చేయడం విశేషం.
గతంలో దిల్ రాజు కోసం రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్టుకు డైరక్టర్. ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాల తరువాత వేణు శ్రీరామ్ ఈ స్క్రిప్ట్ మీద చిరకాలంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు దానినే బన్నీ సింగిల్ టేక్ లో ఓకె చేసినట్లు తెలుస్తోంది. అన్నీ రెడీగా వుండడంతో, త్రివిక్రమ్ సినిమా తరువాత అతి తక్కువ టైమ్ లో ఆ ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి డిసైడ్ అయ్యారు.
డిజె సినిమా తరువాత నిర్మాత దిల్ రాజు హీరో బన్నీతో నిర్మించే సినిమా ఇదే అవుతుంది. సుకుమార్ ప్రాజెక్టు లేట్ అవుతుంది కాబట్టి, బన్నీ ఆ గ్యాప్ లో ఈ సినిమాను ఫినిష్ చేయడానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. బన్నీ తన సినిమాల లైన్ ఆఫ్ ఆర్డర్ చాలా పక్కడ్బందీగా వుండేలా చూసుకుంటున్నారు. మురుగదాస్, సుకుమార్ లు ఇప్పటకే లైన్ లో వున్నారు. విక్రమ్ కుమార్ ను పూర్తిగా వదిలేయలేదు. అలాగే ఇంకా ఒకరిద్దరు డైరక్టర్లు కథలు వండుతున్నారు.