నెగిటీవ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా సరైనోడు బన్నీకి మంచి పలితాన్ని అందించినట్టే. నిజానికి ఈ డివైడ్ టాక్‌కి మరో సినిమా అయితే మూడో రోజునే దుకాణం సర్దేయాలి. కానీ.. సోమవారం నుంచి కూడా వసూళ్లు స్టడీగా ఉన్నాయన్న టాక్స్ రావడం.. సరైనోడుకి ప్లస్గామారింది. సాధారణంగా ఓ సినిమా చేశాక.. మళ్లీ అదే దర్శకుడితో కలసి చేయడానికి హీరోలు సముఖంగా ఉంటారు. ‘బన్నీతో మరో సినిమా చేయడానికి నేను రెడీ’ అంటూ బోయపాటి ఇప్పటికే మనసులో మాట బయపెట్టాడు. సరైనోడుకి సీక్వెల్ కూడా ఉండబోతోందని టాలీవుడ్లో టాక్స్ వినిపిస్తున్నాయి.
అయితే… బన్నీ మాత్రం ”ఇప్పట్లో బోయపాటితో సినిమానా, నా వల్ల కాదు.. ఇది చాలు” అంటున్నాడట. బోయపాటి తన హీరోల్ని బాగా కష్టపెడతాడు. అయితే అవుట్ పుట్ అలానే లాక్కొంటాడు. బోయపాటి స్టైల్ ఆఫ్ డైరెక్షన్ వేరే లెవిల్ లో ఉంటుందని ఆయనతో పనిచేసే హీరోలే చెప్తుంటారు. సరైనోడు కోసం బన్నీ బాగా నలిగిపోయినట్టున్నాడు. అందుకే.. బోయపాటికి కొన్నాళ్లు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడేమో. ఇంత మాస్ మసాలా సినిమా చేశాక.. బన్నీ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ల వైపు దృష్టి మరల్చడం సహజం. అందుకే.. బోయపాటి మార్క్ సినిమాలు వద్దు.. అనుకొంటున్నాడేమో??