తెలుగు తెరకు కొత్త స్టైల్ పరిచయం చేసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అతని డ్రస్సింగ్ స్టైల్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే తను స్టైలీష్ స్టార్ అయ్యాడు. దేశ ముదురులో చొక్కా విప్పి తొలిసారి సిక్స్ ప్యాక్ చూపించాడు బన్నీ. బద్రీనాథ్ కోసం కూడా బాడీ బాగా పెంచాడు. ఇప్పుడు మరోసారి సిక్స్ ప్యాక్ అవసరం వచ్చింది. అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తయారు కానుంది. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా కోసం బన్నీ మరోసారి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్టు వినికిడి.
మాస్ మసాలా అంశాల్ని దట్టంగా దంచిన కథ ఇది. యాక్షన్ సీన్స్‌కి ప్రాధాన్యం ఉందట. అందుకే సిక్స్ ప్యాక్ అవసరమొచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఇదేనని టాక్. ప్రస్తుతం బన్నీ జిమ్ములో కసరత్తులు షురూ చేశాడని, త్వరలోనే తన లుక్ పూర్తిగా మారనున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సరైనోడులోనూ కండలు బాగానే చూపించాడు బన్నీ. అప్పుడు మాత్రం ముందు టాకీ తీసేసి, ఆ తరవాత యాక్షన్ సీన్లు యాడ్ చేశారు. ఆ మధ్య గ్యాప్‌లో బన్నీ జిమ్ములో దూరి కండలు పెంచాడు. ఇప్పుడు మాత్రం ముందు యాక్షన్ సీన్లు ప్రిపేర్ చేయాలని చూస్తున్నారట. సెప్టెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా పూర్తి వివరాలు బయటకు వస్తాయి.