రెండు సినిమాలు చేసినా తనకంటూ ఓ మార్క్ వేసుకోలేకపోయాడు అల్లు శిరీష్. ఇప్పుడు పరశురామ్‌తో జత కట్టి ముచ్చటగా మూడో ప్రయత్నం చేశాడు.. అదే శ్రీరస్తు – శుభమస్తు. ఈ సినిమాకి మంచి ప్రమోషన్ ఇచ్చి.. గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్నది అల్లు అరవింద్ ఆలోచన. ఈ సినిమా కూడా తన్నేస్తే.. శిరీష్ కెరీర్‌కి శుభం కార్డు పడిపోతుంది. అందుకే.. అన్ని వైపుల నుంచీ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. బన్నీ ఈ సినిమాని చూసి కొన్ని మార్పులూ చేర్పులూ సూచించాడట. ఓవరాల్‌గా ఈ సినిమా బన్నికి బాగా నచ్చిందని, దర్శకుడు పరశురామ్‌ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి మరీ అభినందించాడని టాక్. ”తమ్ముడ్ని బాగా చూపించావ్.. మంచి కథ ఉంటే చూడు, చేద్దాం” అంటూ ఓ ఆఫర్ కూడా ఇచ్చాడట.
అయితే ఇలాంటి మాట వరస ఆఫర్లు చాలానే ఇవ్వాల్సివస్తుంటుంది. ప్రస్తుతానికి బన్నీ అయితే ఫుల్ బిజీ. త్వరలో హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కిస్తారు. ఆ తరవాత లింగుస్వామి కూడా రెడీగా ఉన్నాడు. విక్రమ్ కె.కుమార్‌తో ఓ సినిమా చేయాలన్నది బన్నీ ఆలోచన. ఇలా బన్నీ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల లిస్టు పెద్దదే ఉంది. అవన్నీ అవ్వాలి.. అప్పుడు పరశురామ్‌కి ఛాన్స్ ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే ముందు శ్రీరస్తు.. శుభమస్తు హిట్ కొట్టాలి. మరి పరశురామ్ ఏం చేస్తాడో??