కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్… ఇంకొంతకాలం తెలుగులోనే సెటిల్ అయిపోతాడేమో అనిపిస్తోంది. తెలుగు హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి అంతలా ఎగబడుతున్నారు మరి. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` చేస్తున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో ఓ సినిమా ఉంటుంది. ఈలోగా అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా ఖాయం చేసేసుకున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది ఈ ప్రాజెక్టు ఖాయమన్న సంగతి బన్నీకి రైట్ హ్యాండ్, గీతా ఆర్ఠ్స్కి ప్రస్తుతం కర్త, కర్మ, క్రియ అయిన బన్నీ వాసు ధృవీకరించారు కూడా. అల్లు అరవింద్, ప్రశాంత్ నీల్ ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నార్ట. కేజీఎఫ్ సమయంలోనే బన్నీతో ఓ సినిమా చేస్తానని ప్రశాంత్ నీల్ మాటిచ్చాడని తెలుస్తోంది. అప్పుడే అల్లు అరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. తాజాగా.. బన్నీ వాస్ వ్యాఖ్యలతో.. ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారైపోయినట్టైంది.