నిన్న జరిగిన రుద్రమదేవి సక్సెస్ మీట్లో అందులో నటించిన ప్రతి నటుడు తమ తమ అభిప్రాయన్ని సినిమాలో నటించడం పట్ల వారు పొందిన అనుభూతిని షకెస్ మీట్లో ఆడియెన్స్ తో పంచుకున్నారు. ఇక సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినందుకు ముఖ్య కారణమైన గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ ఎప్పటిలానే తన మాటలతో ఆకట్టుకున్నాడు. సినిమాలో రుద్రమదేవిగా అనుష్క అలరించగా.. గన్నారెడ్డి పాత్రలో తాను చేయడం అదృష్టం అని అన్నాడు.
సినిమా తాను చేయడానికి ముఖ్య కారణమైన ప్రకాశ్ రాజ్ కి థాంక్స్ చెబుతూ.. ఈ సినిమాను ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా తీసుకుని చేశారని గుర్తుచేశాడు. ఇక అనుష్క గురించి చెబుతూ అనుష్క మాత్రమే రుద్రమదేవిగా చేయగలదని.. నాది 30 రోజుల కష్టం అయితే అనుష్కది 3 ఏళ్ల కష్టం అని అన్నాడు. సినిమా సక్సెస్ చేసినందుకు ఆడియెన్స్ అందరికి థాంక్స్ చెప్పి తన ప్రసంగాన్ని ముగించాడు.
కృష్ణం రాజు మాట్లాడుతూ.. తాండ్ర పాపారాయుడు తర్వాత 28 సంవత్సరాల తర్వాత వచ్చిన హిస్టారికల్ సినిమా ఇది.. దీన్ని గుణశేఖర్ మలిచిన తీరు అద్భుతం అని అన్నారు. సినిమా సక్సెస్ అయినందుకు అందరికి తన అభినందనలు తెలిపాడు.