లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. ఎప్పుడు షూటింగ్ మొదలెడతామా అని హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కానీ… అల్లు అర్జున్ మాత్రం లాక్ డౌన్‌తో సంబంధం పెట్టుకోకుండా రిలాక్డ్స్‌గా ఉన్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో `పుష్ష` రూపొందుతున్న సంగతి తెలిసిందే. కేరళలో కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలతో పాటుగా పుష్ష కూడా ఆగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినా చిత్రబృందం షూటింగ్ విషయంలో తొందర పడబోవడం లేదట. జున్ 1 నుంచి షూటింగులకు అనుమతి ఇచ్చినా – పుష్ఫ పట్టాలెక్కడానికి మరి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ జులై వరకూ సెట్లోకి అడుగుపెట్టడని విశ్వసనీయ వర్గాల సమాచారం. బన్నీ లేకపోతే.. షూటింగ్ ఎలా? అందుకే.. బన్నీ వచ్చేంత వరకూ చిత్రబృందం ఎదురు చూస్తుంది. ఈలోగా మిగిలిన వాళ్ల కాల్షీట్లు సైతం సర్దుబాటు చేసుకుంటారు. పుష్ష ఎక్కువగా అవుడ్డోర్‌లోనే షూటింగు చేసుకోవాల్సిన సినిమా. ఎండాకాలం, పైగా కరోనా భయం.. అందుకే బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన వాళ్ల కాల్షీట్లు అందుబాటులోకి వచ్చి, జులై నుంచి వాళ్లు మిస్ అవుతున్నారన్న పక్షంలో…. బన్నీ లేకుండానే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించే అవకాశం ఉంది.