దర్శకుడు సుకుమార్ డెంగ్యూ బారీన పడడంతో – పుష్ష షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిజానికి సుకుమార్ ఒక్కడికే కాదు. ఆ టీమ్ లోని దాదాపు ఇరవై మందికి వైరల్ ఫీవర్ వచ్చింది. ఇటీవల… హైదరాబాద్ లోని డాగ్ హౌస్ లో… `పుష్ష` షూటింగ్ జరిగింది. ఆ సందర్భంగానే… చిత్రబృందానికి డెంగ్యూ సోకిందని సమాచారం. ఆ రోజు సెట్లో ఉన్న వాళ్లంతా దాదాపుగా డెంగ్యూకి గురైనవాళ్లే. ఆ సెట్లో బన్నీ, రష్మికలు కూడా ఉన్నారు. వాళ్లిద్దరు మాత్రం డెంగ్యూ నుంచి తప్పించుకున్నారు. సుకుమార్ మినహా మిగిలిన వాళ్లంతా కోలుకున్నారు. సుకుమార్ కి జ్వరం వస్తూ, పోతుండడంతో… షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
* సుకుమార్ కి ఇతర సమస్యలున్నాయా?
సుకుమార్ కి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆయనకు నడుం నొప్పి ఎక్కువగా ఉందని, కూర్చీలో కూడాకూర్చోలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే.. పుష్ష షూటింగ్ కి అవాంతరం ఏర్పడింది. సుకుమార్ కి హోమియోపతి ట్రీట్మెంట్ పై గురి ఎక్కువ. హోమియో పతిలో రిజల్ట్ రావాలంటే ఓపిక అవసరం. అందుకే.. సుకుమార్ కోలుకోవడానికి టైమ్ పడుతోందట.