`నా పేరు సూర్య` ఇంపాక్ట్ బన్నీపై బాగానే పడింది. `ఇక మీదట ప్రయోగాల జోలికి వెళ్లను` అని గట్టిగా డిసైడ్ అయిపోయాడు. అయితే అక్కడే చిక్కొచ్చిపడింది. అల్లు అర్జున్ తదుపరి సినిమా… విక్రమ్ కె.కుమార్‌తో. ఆయనేమో ప్రయోగాల స్పెషలిస్టు. విక్రమ్‌తో సినిమా చేయడానికి బన్నీ కూడా తహతహలాడుతున్నాడు. కాకపోతే ఒక్కటే షరతు. ‘మరీ ప్రయోగాలైతే వద్దు’ అనేస్తున్నాడట. అందుకే విక్రమ్ ఇప్పటి వరకూ చెప్పిన రెండు కథల్ని బన్నీ పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో కథ నేరేట్ చేస్తున్నాడు విక్రమ్. ఆ లైన్ బన్నీకి బాగా నచ్చిందని, అందులో కొన్ని కమర్షియల్ తాళింపులు వడ్డించమని చెప్పాడని సమాచారం. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోగా.. ఈ సినిమాపై ఓ స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందించాలని ముందు అనుకున్నా.. ప్రస్తుతానికి తెలుగుకే పరిమితం చేసినట్టు తెలుస్తోంది.