మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’కి తెలుగు అనువాదం ‘లవర్స్ డే’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రావడానికి కారణం ప్రియా ప్రకాష్ వారియర్ అనుకున్నారంతా. గతంలో అల్లు అర్జున్ సరసన నటించే ప్రియా ప్రకాష్ వారియర్ కి వెళ్లడంతో ఈ ఊహాగానాలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ హాజరుకు అసలు కారణం ప్రియా ప్రకాష్ వారియర్. ‘లవర్స్ డే’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్. వినోద్ రెడ్డి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని కొన్ని ఏరియాల్లో వినోద్ రెడ్డి పంపిణీ చేశారు. నష్టాలు వచ్చినా వినోద్ రెడ్డి గొడవలు చేయలేదని అతడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తనకు శక్తి ఉంటే అభిమానుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధమని అల్లు అర్జున్ అన్నారు.
‘లవర్స్ డే’ ఆడియోలో అర్జున్ మాట్లాడుతూ “ఇక్కడికి నేను రావడానికి రెండు కారణాలు వున్నాయి. మలయాళ ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. మలయాళ పరిశ్రమ నుంచి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం మన తెలుగుకు వస్తున్నప్పుడు ఆ సినిమాను ప్రోత్సహించడం నా బాధ్యత అనుకున్నా. ఇదో కారణం అయితే వినోద్ రెడ్డి ముఖ్య కారణం. ‘నా పేరు సూర్య’ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు వినోద్ రెడ్డిని బన్నీ వాసు నాకు పరిచయం చేశాడు. ‘మీ అభిమాని’ అని చెప్పాడు. మన సినిమా కొన్నాడు కాబట్టి ఇలా చెబుతున్నావా? అని అడిగా. ‘లేదండి. నిజంగా మీ అభిమాని’ అన్నాడు. సినిమా విడుదల తరవాత సరిగా ఆడకపోవడం వలన గొడవలు జరిగాయి. అప్పుడు బన్నీ వాసు ‘వినోద్ రెడ్డి అసలు గొడవ చేయడం లేదు’ అని చెప్పాడు. అప్పుడు వినోద్ రెడ్డికి ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఎందుకంటే నా అభిమానులను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అభిమానులను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు” అని అన్నారు.
లవర్స్ డే’ ఆడియోలో అల్లు అర్జున్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అల్లు అర్జున్‌కి గురి పెడుతూ ప్రియా ప్రకాష్ వారియర్ కిస్సింగ్ గన్ షాట్ కొట్టడం ఒక హైలైట్ అయితే… తన స్పీచ్ పూర్తి చేశాక ప్రేక్షకులకు గురి పెడుతూ అల్లు అర్జున్ ఇచ్చిన గన్ షాట్ మరో హైలైట్.