ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టేశాడు దువ్వాడ జగన్నాథమ్. చాలా సింపుల్‌గా క్యారెక్టర్ కి తగ్గట్టు, అన్నింటికంటే రొటీన్‌కి భిన్నంగా ఫస్ట్ లుక్ విడుదల చేసి చిత్రబృందం ఆకట్టుకొంది. బన్నీ క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో.. పాత స్కూటర్ మీద ఇచ్చిన స్మైల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ లుక్ చూశాక… దువ్వాడ జగన్నాథమ్పై పెంచుకొన్న అంచనాలు అమాంతం రెట్టింపు అవ్వడం ఖాయం. ఈలోగా.. డీజే కథ ఇదే అంటూ.. పోస్టర్ చూసి కథని అల్లేయడం మొదలెట్టారు గాసిప్ రాయుళ్లు. గతంలో అదుర్స్ సినిమాకీ డీజేకీ పోలికలు తీసినవాళ్లు ఇప్పుడు కమల్ హాసన్ నటించిన మైఖైల్ మదన కామ రాజు అనే పాత సినిమాని గుర్తు చేసే పనిలో పడ్డారు. అందులో ఓ కమల్ హాసన్ బ్రాహ్మణ వంటవాడు. ఇక్కడా డీజే పాత్ర అదే కాబట్టి.. రెండింటికీ లింకు ఈజీగా కుదిరిపోయింది.
అయితే.. ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఓ పాత్ర ఇలా.. బ్రాహ్మణ వంటవాడిగా కనిపిస్తే, రెండో గెటప్‌లో మనోడు రహస్య పోలీస్‌లా వ్యవహారాలు చక్కబెడుతుంటాడట. అదుర్స్ కథ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ అక్కడ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్. ఇక్కడ మాత్రం బన్నీ ఒక్కడే అటు వంటవాడిగా, ఇటు పోలీస్ గా ద్విపాత్రాభినయం చేస్తాడన్నమాట. మరి… ఈ కథ నిజమో, కాదో.. ఇది కూడా గాసిప్ రాయుళ్ల సృష్టో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. మొత్తానికి ఫస్ట్ లుక్ అయితే సూపర్ హిట్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ కూడా ఇలానే వస్తే, అంతకంటే కావల్సింది ఏముంది?