ఫ్లాష్..ష్లాష్. సరైనోడు సినిమా లీకైంది. పైరసీ భూతం మళ్లీ.. పడగ విప్పింది. సినిమా విడుదలకు ముందే.. లీకైపోయింది. అత్తారింటికి దారేదితో వికృతరూపం దాల్చిన ఈ జాడ్యం.. ఇప్పుడు సరైనోడుకీ అంటుకొందట. ఈనెల 22న సరైనోడు సినిమా విడుదల కాబోతోంది. అయితే వారం రోజుల ముందే.. పది హేను నిమిషాల సినిమా బయటకు వచ్చేసింది. దాంతో చిత్ర బృందం తలలు పట్టుకొంది. వెబ్ లింకులన్నీ వెదికిపట్టుకొని. వాటిని డిలీట్ చేసే పనిలో తలమునకలైపోయింది చిత్రబృందం.
శుక్రవారం అర్థరాత్రి ఆన్లైన్లో కొన్ని లింకుల్ని కనిపెట్టింది గీతా ఆర్ట్స్. అందులో… సరైనోడు సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలున్నాయట. దాంతో వెంటనే అప్రమత్తమై.. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ లింకుల్ని తొలగించింది. ఇంకా ఏమైనా లింకులు మిగిలి ఉన్నాయా అనే విషయంపై తీవ్రమైన గాలింపు చేపట్టింది. విడుదలకు ముందే సినిమాలోని కీలకమైన సన్నివేశాలు బయటకు వచ్చేయడంతో దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎవరి ద్వారా లీకయ్యాయి అన్న విషయంపై ఇప్పుడు లోతైన పరిశోధన చేస్తున్నార్ట. ఇదే విషయాన్ని గీతా ఆర్ట్స్ సిబ్బందిని అడిగితే ”సరైనోడు లీకా?? అలాంటిదేం జరగలేదే” అంటున్నారు. కానీ.. లీకైన మాట నిజమని, అయితే సకాలంలో స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పందని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.