సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, ఆశించిన ఫలితాలు రానప్పుడు సెంటిమెంట్లు బయటకు వస్తాయి. ఆఫీసులకు వాస్తు దోషాలు వున్నాయేమో అని పండితులను పిలిపించి చూపించుకోవడం లేదా కొత్త ఆఫీసులోకి మారడం వంటివి చేస్తారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, స్టైలిష్ స్టార్ అల్లుడు అర్జున్ ఇప్పుడు అటువంటి పనే చేశాడు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త ఆఫీసులోకి అడుగుపెట్టాడు. సాధారణంగా అల్లు అర్జున్ని ఎవరైనా దర్శక నిర్మాతలు కలవాలంటే గీతా ఆర్ట్స్ సంస్థలో కలుస్తారు. అల్లు శిరీష్, బన్నీ వాసు… ఇతర గీతా ఆర్ట్స్ కాంపౌండ్ జనాలు అందరూ తమ ఆఫీసులోనే కలుస్తారు. మరి, అల్లు అర్జున్ కొత్తగా ఆఫీస్ తీసుకోవడం ఎందుకో మరి??
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరవాత అల్లు అర్జున్ మరో సినిమా చేయబోతున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అనుకున్నారు. అది క్యాన్సిల్ అయ్యింది. అంతకు ముందు కొత్త దర్శకుడితో అనుకున్నారు. అదీ క్యాన్సిల్ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామితో అనుకున్న తెలుగు, తమిళ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యింది. ఒక యంగ్ హీరో ఇన్ని నెలలు ఖాళీగా వుండటం అంటే మామూలు విషయం కాదు. పరిస్థితుల్లో మార్పు కోసం కొత్త ఆఫీసులోకి మారారేమో??