మహేష్ బాబుతో సినిమా చేయాల్సిన సుకుమార్, ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి అల్లు అర్జున్ దగ్గరకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టేంటంటే… మహేష్ మార్పులు, చేర్పులూ సూచించిన కథనే అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట సుకుమార్. ఇటీవల మహేష్‌ని కలిసిన సుకుమార్.. `మీ కథనే బన్నీతో చేస్తున్నా` అని చెప్పి, మహేష్ అనుమతి కూడా తీసుకొని వచ్చాడని టాక్.
మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఓ కథ రాసుకున్నాడు. అందులో హీరో పాత్ర చాలా ‘రా’గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆ పాత్ర నచ్చే మహేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లేలో చిన్నపాటి మార్పులు సూచించాడు. ఆ తరవాత మహేష్ చెప్పిన మార్పుల్ని పరిగణలోకి తీసుకుని, మహేష్ కి నచ్చినట్టు సుకుమార్ ఈ స్క్రిప్టుని తయారు చేయలేకపోయాడు. దాన్నే మహేష్ ‘క్రియేటీవ్ డిఫరెన్సెస్’ అంటూ తేల్చిన సంగతి కూడా మనం చూశాం. ఇప్పుడు ఆ కథే.. బన్నీ దగ్గరకు వెళ్లింది. ఈసారి మాత్రం బన్నీ ఎలాంటి మార్పులూ లేకుండా ఈ కథని అంగీకరించడంతో.. సుకుమార్ పని సులభం అయ్యింది. చాలామంది హీరోలు ‘నో’ చెప్పిన కథలు మహేష్ దగ్గరకు వెళ్తుంటాయి. ఈసారి మాత్రం మహేష్ ‘నో’ చెప్పిన కథ బన్నీ దగ్గరకు వచ్చి ఆగింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.