కమెడియన్ నుండి హీరోగా మారిన సునిల్ కొద్దికాలం గ్యాప్ తర్వాత కృష్ణాష్టమి సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టాడు సునిల్. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో జోష్ ఫేం వాసు వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముందు అల్లు అర్జున్ కు వినిపించారట దర్శక నిర్మాతలు.
అయితే కథ విన్న బన్ని కథలో కొన్ని మార్పులు చేయవలసిందిగా కోరాడట. బన్నితో సినిమా అంటే ఇప్పుడప్పుడే అవుతుందో లేదో అని అదే కథను సునీల్ తో చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం పోటీ పడుతున్న కుర్ర హీరోల సినిమాల్లో ఈ సినిమాతో తన సత్తా చాటాలనుకుంటున్నాడు సునీల్. భీమవరం బుల్లోడు తర్వాత చేస్తున్న ఈ సినిమా తన కెరియర్ ను డిసైడ్ చేస్తుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాడు.
జోష్ సినిమాతో డెబ్యూ డైరక్టర్ గా కాన్సెప్ట్ ఓకే అనిపించుకున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన వాసు వర్మ సునీల్ కృష్ణాష్టమితో సూపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి బన్ని కథతో వస్తున్న సునీల్ ఈ సినిమాతోనైనా ప్రేక్షకుల మనసు దోచుకుంటాడా లేదా అన్నది మరో వారం రోజులు ఆగితే తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే హీరో సునీల్, దర్శకుడు వాసు వర్మ పరిస్తితి అగమ్యగోచరంగానే ఉంటుంది.