ప్రతీ హీరోకీ తన సినిమా ఎలా ఉండాలి అన్న విషయంలో ఓ క్లారిటీ ఉంటుంది. ఉండాలి కూడా! అల్లు అర్జున్‌కి ఆ విషయంలో పిచ్చ క్లారిటీ ఉందట. ఈవిషయం స్వయంగా బన్నేనే చెబుతున్నాడు. ”నాకో పిచ్చి ఉంది. నా సినిమా ఫ్లాప్ అయినా, హిట్టయినా లెక్కలేదు. సినిమా మాత్రం విజువల్‌గా బాగుండాలి. సరైనోడు సినిమాకి ఆ విషయంలో చాలా కేర్ తీసుకొన్నాం. బొవిలియాలో పాట తెరకెక్కించడానికి కారణం అదే. అక్కడ ఖర్చు ఎక్కవని తెలుసు. కానీ నాన్నను బతిమాలి.. బొవిలియాలో పాట షూట్ చేశాం” అని చెప్పుకొచ్చాడు. తెలుసా.. తెలుసా అనే పాటని బొవిలియాలో తెరకెక్కించారు. ఆ పాటకు రూ.3 కోట్లు ఖర్చయ్యాయట. నిజానికి ఆ పాటని స్విర్జర్లాండ్ లో తీద్దామనుకొన్నారు. స్విస్‌లో తీస్తే..కోటి రూపాయలతో ఆ పాట బయటకు వచ్చేది. కానీ.. బన్నీ పట్టుబట్టి బొవిలియా తీసుకెళ్లాడట.
”బన్నీ నా దగ్గరకు వచ్చి బొవిలియా వెళ్దాం డాడీ అని మారాం చేశాడు. అక్కడొద్దురా.. డబ్బులు ఎక్కువవుతాయి అన్నా. కానీ వినలేదు. ఫైనల్‌గా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినా.. ఆ పాట బాగా వచ్చింది. సో.. ఐ యామ్ హ్యాపీ” అని అల్లు అరవింద్ తనయుడ్ని వెనకేసుకొచ్చారు. ఒక్క పాటకు మూడు కోట్లంటే మాటలా?? ఆ డబ్బుతో మారుతి మూడు చిన్న సినిమాలు తీసేస్తాడు. పెద్ద సినిమాలంటే అంతేమరి. ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా?