టాలీవుడ్లో మరో అగ్రహీరో కరోనా బారిన పడ్డారు. అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లుగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారు.. టెస్టులు చేయించుకోవాలని బన్నీసూచించారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి పలువురు కరోనా బారిన పడ్డారు. పవన్ కల్యాణ్, కల్యాణ్ దేవ్ కూడా.. పాజిటివ్‌గా తేలడంతో చికిత్స తీసుకున్నారు. పవన్ కల్యాణ్ కోలుకున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అర్జున్‌కు పాజిటివ్ రావడంతో. .. సినిమా షూటింగ్‌పై ఎఫెక్ట్ పడనుంది.
టాలీవుడ్లో అత్యవసర షూటింగ్‌లు అదీ కూడా.. సగం మందితోనే నిర్వహించుకోవాలని.. ఇటీవల సినీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఆంక్షలేమీ లేకపోవడంతో పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు.. తమ షూటింగ్లనుతాము కొనసాగిస్తున్నారు. సాదాసీదా కోవిడ్ రూల్స్ పాటిస్తూ.. పెద్ద ఎత్తున షూటింగ్‌లు కొనసాగిస్తూండటంతో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పుష్ప షూటింగ్ ప్రారంభమయినప్పటి ఆ యూనిట్లో పలువురికి పాజిటివ్‌గా తేలింది.
అల్లు అర్జున్‌కు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని.. చాలా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. పవన్ కల్యాణ్.. కల్యాణ్ దేవ్ కూడా హోమ్ ఐసోలేషన్‌తోనే కోలుకున్నారు. ఇండస్ట్రీలోని వారికి ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు చిరంజీవి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభమయిన తర్వాత టాలీవుడ్‌కు కరోనా నుంచి కాస్తంత ధైర్యం వచ్చ అవకాశం ఉంది. లేకపోతే.. మరింతగా టాలీవుడ్ ఇబ్బందిపడే అవకాశం ఉంది.