‘ఇష్క్’ సినిమాతో హీరో నితిన్ని గట్టెకించిన దర్శకుడు విక్రం. తరువాత నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమాకి దర్శకత్వం వహించి తన ప్రతిభను మరోమారు చాటుకొన్నారు. కానీ ఆ తరువాత తమిళంలో హీరో సూర్యతో ‘24’ అనే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేయడానికి కోలీవుడ్ వెళ్లిపోయారు. మరొక నెల-నెలన్నరలోగా ఆ సినిమా షూటింగ్ పూర్తవబోతోంది. అది పూర్తవగానే మళ్ళీ టాలివుడ్ కి తిరిగివచ్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తరువాతనే విక్రంతో సినిమా మొదలుపెడతారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో వీరిరువురి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దసరా తరువాత ఎప్పుడయినా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది.