అల్లు అర్జున్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ రికార్డ్ (నాన్ బాహుబలి 2) సాధించాడు కదా. పైగా భీకరమైన పోటీని ఎదుర్కొని, తన సినిమాని బాక్సాఫీసు రికార్డు చిత్రాల సరసన నిలబెట్టగలిగాడు. అందునా… ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లాంటి ఫ్లాపు తరవాత, ధీటైన హిట్టుతో రేసులోకి వచ్చేశాడు. అందుకే అంత ఆనందం. ఇప్పుడు ఈ సంతోషాన్ని పరిశ్రమతోనూ పంచుకోబోతున్నాడు. త్వరలోనే ఓ భారీ పార్టీని ప్లాన్ చేశాడు బన్నీ. పరిశ్రమలోని తన సన్నిహితులకు, హీరోలకు, నిర్మాతలకు, మీడియాకూ ఓ ప్రత్యేకమైన విందు ఇవ్వబోతున్నాడు. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్చరణ్ లాంటి హీరోలూ పాల్గొనబోతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా హీరోల్ని ఆహ్వానిస్తాడని తెలుస్తోంది. ఈ పార్టీ అయ్యాక.. మీడియాకు ప్రత్యేకంగా మరో పార్టీ ఇవ్వబోతున్నాడు. ఈ రెండు పార్టీలూ గ్రాండ్గా, ‘అల వైకుంఠపురములో’ హిట్టు స్థాయికి తగ్గట్టుగానే ఉంటుందట. మరి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఏం చేస్తుందో?