అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. బన్నీ లేకుండానే కేరళలో 6 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొచ్చింది చిత్రబృందం. జనవరి 17 నుంచి అసలు షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాలు పంచుకోబోతున్నాడు. సంక్రాంతిని బన్నీ సినిమా `అల వైకుంఠపురములో` విడుదల అవుతుంది. ఆ తరవాత బన్నీ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సెట్స్‌పైకి వెళ్లిపోతాడన్నమాట. ఈ సినిమాకి టైటిల్ ని కూడా వీలైనంత త్వరగా ప్రకటించే పనిలో ఉంది చిత్రబృందం. సుకుమార్ దగ్గర ఆల్రెడీ మూడు నాలుగు టైటిళ్లు రెడీగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఎంచుకుని, ప్రకటించడమే తరువాయి. జనవరిలోనే బన్నీ కొత్త సినిమా టైటిల్ ఏమిటో అధికారికంగా చెప్పేసే అవకాశం ఉంది.